Saturday, May 9, 2009

అమ్మ

నీకు ఊపిరి పోసే దేవత. ఎదిగే బిడ్డకు అన్నపానాలందించే అన్నపూర్ణ. చదువులు నేర్పే గురువు. 
నా తొలి స్నేహితురాలు, నా తొలి గురువు, నాకు ఎల్లవేళల స్పూర్తి నందిచే మార్గ దర్శకురాలు. నాకు మా అమ్మే అన్నీను. అమ్మ కూచి అని నా చుట్టు ఉండే వాళ్ళు అప్పుడప్పుడు అన్నా అది నేనొక కాంప్లిమెంటుగా తీసుకుంటా. నా పదేళ్ళ వయసులోనే మా నాన్నగారు అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినా ఆ లోటు తెలియకుండ మమ్మల్ని యువరాణుల్లాగ పెంచిన అమ్మంటే నాకెంతో ఆరాధన. నేనొక సారి చీకటిని చూసి భయపడుతున్నపుడు 'భయం అంటే ఎక్కది నించో రాదు అది నీ మనసులోనే ఉంది ' అని చెప్పిన అమ్మంటే ఏదో ఒక తెలియని వింత స్పూర్తి.వంటలు అద్భుతంగ చేసే అమ్మ, ఎల్ల వేళల ధయిర్యాన్ని నింపే అమ్మ, ఎటువంటి కష్టానికయిన ఓర్చుకునే అమ్మ, నా అల్లరి చేష్టలన్ని ఓర్పుగ భరించే అమ్మ, అసలు అమ్మకు ఎందుకు కోపం రాదు అని తరచు ప్రస్నించు కుంటుంటాను.
ఎటువంటి విషయాన్నయిన అమ్మతో పంచుకో గలిగే చనువు నాకుంది అనవసర భయాలు అనుమానాలు అపార్థలు మా మధ్య రావు. వచ్చినా నిలవవు అమ్మ చిరునవ్వుతో వాటన్నిటిల్నీ జయించేస్తుంది చిటికలో . 
అమ్మ పేరు శారద. పాటలు , వంటలు , పుస్తకాలు అమ్మ అభిరుచులు. నేను చదువుకుంటే అమ్మ కెంతో ఇష్టం. అల్లరి చేసే నేనంటే అమ్మకి కొంచం భయం మరి కొంచెం కోపం అయిన అది సరదా కోపమే ఒక్క రోజు నేను నిశ్శబ్ధంగా ఉన్నా ' పాపా ! ఏమయింది ఎందుకలాగ ఉన్నావని ' నిమిషానికోసారి అడుగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తన్ని తనెప్పుడు మలచుకుంటుంది .
 పులిహార ఎంత బాగ చేస్తుందో బిర్యాని అంతే బాగ వండ గలదు. ధ్యానం చేయటమంటే మా అమ్మకి ఎంతో ఇష్టం అందులో ఉండే ప్రశంతతని అమ్మ ఎంతగానో ఇష్ట పడుతుంది . ఇంకా ఎంతో రాయలని అనుకున్న అమ్మ గురించి రాయటానికి నా భాష చాలదు నా భావము చాలదు. అమ్మ ఋణం తన అమ్మగా పుట్టి తీర్చుకోవాలనిపిస్తుంది నాకు.

రాజవరపు సంగమేశ్వర రావు , భాను లక్ష్మిల నాల్గవ సంతానం అమ్మ. తన పదిహేడవ ఏట నాన్నగారిని పెళ్లి చేసుకుని ఆదూరి వారింట అడుగు పెట్టింది. పొదుపు, అణుకువ తీరువ అభిమానం ఆమెకు పెట్టని ఆభరణాలు . . అన్ని రకాల సాహిత్యాలు చదవటం అమ్మకు ఎంతో ఇష్టం ... అమ్మ నుంచే నాకు పుస్తక పఠనం అలవాటు అయింది ... అమ్మ అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి , పాత సినిమా పాటలు వినడం పాడడం . ఎవరితోనయినా త్వరగా కలిసి పోవటం అమ్మ అలవాటులు .. ఇంటిలో ఉన్నంత సేపు అమ్మ కొంగు పట్టుకు తిరగటం అమ్మని అన్ని రకాలుగా విసిగించడం నా శని ఆది వారాల నా weekly schedule.. అమ్మ నాతొ తప్ప ఎవ్వరితోనయిన క్లోసుగా ఉంటె నేను భరించలేను వెంటనే ఉడుక్కుంటాను ... అలుగుతాను ... రాద్ధాంతం చేసేస్తాను... అసలు మా అమ్మంత చల్లని హృదయం కోమల స్పర్ష ఆత్మీయ అనురాగం వెచని తోడూ మరెవ్వరు ఇవ్వలేరని నా ధృడ అభిప్రాయం. అమ్మతో నా అను
బంధం ఎవ్వరు విడతీయలేనిది . ఇంకా అమ్మను గురించి చెప్పటానికి నా భాష సరిపోవటం లేదు ... మొట్ట మొదటిసారిగా ఇంకా అమ్మని గురించి చెప్పలెనందుకు నా కలాన్ని నిందిస్తున్న.. చివరిగా .. అమ్మ నువ్వంటే నాకెంతో ఇష్టం ఇంకా ఇంకా ప్రేమ ..I LOVE YOU SO MUCH AMMA ... I LOVE YOU .. అండ్ హ్యాపీ మదర్స్ డే

4 comments:

మాలా కుమార్ said...

మకరందం గారు,
అమ్మ ఋణం తన అమ్మగా పుట్టి తీర్చుకోవాలనిపిస్తుంది,
నిజమే.

పరిమళం said...

శారద అమ్మకు mothers day శుభాకాంక్షలు !

మధురవాణి said...

"అమ్మ ఋణం తన అమ్మగా పుట్టి తీర్చుకోవాలనిపిస్తుంది నాకు."
శ్రీదేవి గారూ చాలా గొప్ప మాట చెప్పారు. నిజంగా అదొక్కటే ఋణం తీర్చుకోగలిగే మార్గం.!

మాలా కుమార్ said...

మీ అమ్మగారు రాసిన కవితలు పెడుతానన్నారు ఏవి అవి?
నిన్న వాటికోసము వెతికాను