Monday, May 11, 2009

నా పాట

SR_ramachakkanisee...

అవును. నేను పాడగలను . నాకు రామదాసు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు పాడుకోవటం అంటే ఇష్టం. దగ్గరున్న వాళ్ళు వద్దు తల్లో !! అంటున్న సరే !!అబ్బే వినే సమస్యే లేదు.

ఇప్పుడు మీ వంతూ . ఎలా పాడానో కాస్త చెప్పండి ప్లీజ్ .

శ్రీ

Saturday, May 9, 2009

అమ్మ

నీకు ఊపిరి పోసే దేవత. ఎదిగే బిడ్డకు అన్నపానాలందించే అన్నపూర్ణ. చదువులు నేర్పే గురువు. 
నా తొలి స్నేహితురాలు, నా తొలి గురువు, నాకు ఎల్లవేళల స్పూర్తి నందిచే మార్గ దర్శకురాలు. నాకు మా అమ్మే అన్నీను. అమ్మ కూచి అని నా చుట్టు ఉండే వాళ్ళు అప్పుడప్పుడు అన్నా అది నేనొక కాంప్లిమెంటుగా తీసుకుంటా. నా పదేళ్ళ వయసులోనే మా నాన్నగారు అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినా ఆ లోటు తెలియకుండ మమ్మల్ని యువరాణుల్లాగ పెంచిన అమ్మంటే నాకెంతో ఆరాధన. నేనొక సారి చీకటిని చూసి భయపడుతున్నపుడు 'భయం అంటే ఎక్కది నించో రాదు అది నీ మనసులోనే ఉంది ' అని చెప్పిన అమ్మంటే ఏదో ఒక తెలియని వింత స్పూర్తి.వంటలు అద్భుతంగ చేసే అమ్మ, ఎల్ల వేళల ధయిర్యాన్ని నింపే అమ్మ, ఎటువంటి కష్టానికయిన ఓర్చుకునే అమ్మ, నా అల్లరి చేష్టలన్ని ఓర్పుగ భరించే అమ్మ, అసలు అమ్మకు ఎందుకు కోపం రాదు అని తరచు ప్రస్నించు కుంటుంటాను.
ఎటువంటి విషయాన్నయిన అమ్మతో పంచుకో గలిగే చనువు నాకుంది అనవసర భయాలు అనుమానాలు అపార్థలు మా మధ్య రావు. వచ్చినా నిలవవు అమ్మ చిరునవ్వుతో వాటన్నిటిల్నీ జయించేస్తుంది చిటికలో . 
అమ్మ పేరు శారద. పాటలు , వంటలు , పుస్తకాలు అమ్మ అభిరుచులు. నేను చదువుకుంటే అమ్మ కెంతో ఇష్టం. అల్లరి చేసే నేనంటే అమ్మకి కొంచం భయం మరి కొంచెం కోపం అయిన అది సరదా కోపమే ఒక్క రోజు నేను నిశ్శబ్ధంగా ఉన్నా ' పాపా ! ఏమయింది ఎందుకలాగ ఉన్నావని ' నిమిషానికోసారి అడుగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తన్ని తనెప్పుడు మలచుకుంటుంది .
 పులిహార ఎంత బాగ చేస్తుందో బిర్యాని అంతే బాగ వండ గలదు. ధ్యానం చేయటమంటే మా అమ్మకి ఎంతో ఇష్టం అందులో ఉండే ప్రశంతతని అమ్మ ఎంతగానో ఇష్ట పడుతుంది . ఇంకా ఎంతో రాయలని అనుకున్న అమ్మ గురించి రాయటానికి నా భాష చాలదు నా భావము చాలదు. అమ్మ ఋణం తన అమ్మగా పుట్టి తీర్చుకోవాలనిపిస్తుంది నాకు.

రాజవరపు సంగమేశ్వర రావు , భాను లక్ష్మిల నాల్గవ సంతానం అమ్మ. తన పదిహేడవ ఏట నాన్నగారిని పెళ్లి చేసుకుని ఆదూరి వారింట అడుగు పెట్టింది. పొదుపు, అణుకువ తీరువ అభిమానం ఆమెకు పెట్టని ఆభరణాలు . . అన్ని రకాల సాహిత్యాలు చదవటం అమ్మకు ఎంతో ఇష్టం ... అమ్మ నుంచే నాకు పుస్తక పఠనం అలవాటు అయింది ... అమ్మ అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి , పాత సినిమా పాటలు వినడం పాడడం . ఎవరితోనయినా త్వరగా కలిసి పోవటం అమ్మ అలవాటులు .. ఇంటిలో ఉన్నంత సేపు అమ్మ కొంగు పట్టుకు తిరగటం అమ్మని అన్ని రకాలుగా విసిగించడం నా శని ఆది వారాల నా weekly schedule.. అమ్మ నాతొ తప్ప ఎవ్వరితోనయిన క్లోసుగా ఉంటె నేను భరించలేను వెంటనే ఉడుక్కుంటాను ... అలుగుతాను ... రాద్ధాంతం చేసేస్తాను... అసలు మా అమ్మంత చల్లని హృదయం కోమల స్పర్ష ఆత్మీయ అనురాగం వెచని తోడూ మరెవ్వరు ఇవ్వలేరని నా ధృడ అభిప్రాయం. అమ్మతో నా అను
బంధం ఎవ్వరు విడతీయలేనిది . ఇంకా అమ్మను గురించి చెప్పటానికి నా భాష సరిపోవటం లేదు ... మొట్ట మొదటిసారిగా ఇంకా అమ్మని గురించి చెప్పలెనందుకు నా కలాన్ని నిందిస్తున్న.. చివరిగా .. అమ్మ నువ్వంటే నాకెంతో ఇష్టం ఇంకా ఇంకా ప్రేమ ..I LOVE YOU SO MUCH AMMA ... I LOVE YOU .. అండ్ హ్యాపీ మదర్స్ డే

Monday, May 4, 2009

మా సీతా రామ శాస్త్రిగారు

ఎప్పుడూ వొప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వొదులుకోవద్దురా ఓరిమి

విశ్ర మించ వద్దు ఏ క్షణమ్

విస్మరిన్ఛవద్దు నిర్ణయమ్అప్పుడే నీ జయమ్ నిశ్ఛయమ్

ఎప్పుడూ వొప్పుకోవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్కముందు తక్కువేనురా

సంద్రమెంత గొప్పదయిన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పశ్ఛిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా

గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా

నిశా విలాసమెన్త సేపురా

ఉషొదయాన్ని ఎవ్వరాపురా

రగులుతున్న గుండె కూడ సూర్యగోళమట్టిదేనురా

ఎప్పుడూ వొప్పుకోవద్దురా ఓటమిఎప్పుడూ వొదులుకోవద్దురా ఓరిమి

నొప్పి లేని నిముషమేది జననమయిన మరణమయిన

జీవితాన అడుగుఅడుగునా

నొప్పి లేని నిముషమేది జననమయిన మరణమయిన

జీవితాన అడుగుఅడుగునానీరసించి నిలఛి పోతె

నిముషమయిన నీది కాదుబ్రతుకు అంటే నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది

ఇంతకన్న సైన్యముండునా

ఆశనీకు అస్త్రమవును శ్వాస నీకు శశ్త్రమవును

ఆశయమ్ము సారదవును రా

నిరంతరం ప్రయత్నమున్నదా

నిరాశకే నిరాశపుట్టదా

నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశపుట్టదా

ఆయువంటు ఉన్నవరకు ఛావు కూడ నెగ్గలేక

శవము పైన గెలుపు ఛాటురా

ఎప్పుడూ వొప్పుకోవద్దురా ఓటమిఎప్పుడూ వొదులుకోవద్దురా ఓరిమి

సీతారామ శాస్త్రి గారి కలం లో నుంచి ఉబికిన ఉడుకు నెత్తుటి భావ జాలమిది ..నాకు ఎంతో ఇష్టమయిన కవిత ఇది.. మీకు కూడా నచ్చుతుంది అని నా బ్లాగులో ప్రచురిస్తున్న. ఇది చదివినప్పుడల్ల్ల నాకు ఏంటోఎంతోఎంతో స్ఫూర్తి నింపు కున్న అనుభూతిని కలిగిస్తుంది. మరింతగా అవకాశాలు నాకే ఎందుకు రాలేదో అన్నా స్వార్ధం నుంచి అబ్బ ! నాకు ఈరోజు కూడా బతికే అవకాసాన్ని ఇచ్చిన సూర్యోదయన్ని భూమిపయిన మిగిలున్న నా నూకల విలువని మరీ మరీ గుర్తు చేస్తున్నట్లనిపిస్తుంది. నిరాశ నుంచి ఆశ వయిపుకి నన్ను నడిపిస్తుంటుంది. హ్యట్సాఫ్ తొ శాస్త్రి గారు..