Thursday, May 15, 2008

నేస్తం


నీ కన్నుల తడిని నేనయ్యి నిన్నోదారుస్తాను
నీ మనసులో వేడినయ్యి నిన్ను ఉత్సాహపరుస్తాను
నీ సమస్యల మేధస్సుకు హాయి నేనయ్యి నిన్ను శాంతిమ్పచేస్తాను
చూస్తుండు నేస్తం !
నీ పెదవులపయిన చిరునవ్వుల హరివిల్లు నేనయ్యి రంగులు విరబుయిస్తాను.!!

ప్రేమేనేమో


చిరుగాలి తాకిడికి మువ్వెందుకు నవ్విందంటే
సెలయేరు గల గలా సంద్రం వేపు దుకిందంటే
తొలికిరణాల సవ్వడికి ప్రకృతి యెందుకు మేలుకొందంటే
మెరుపుల మేఘాల సందడికి నెమలెందుకు ఆడిందంటే
తుమ్మెదల ఝుమ్కారానికి విరులేందుకు విరిసాయంటే
ప్రేమేనేమో అది ప్రేమేనేమో
అతని నిట్టూర్పుల వెచ్చదనానికి
అతని నవ్వులలోని స్వచ్చందనానికి
అతని పిలుపుల్లోని కొంటెదనానికి
అతని కౌగిలి లోని చల్లదనానికి
మనసేందుకు మురిసిందంటే
ప్రేమేనేమో అది ప్రేమేనేమో

నా బడాయి


మబ్బుల కురులున్న ఆకాశం నక్షత్రాల పూవులను పొదుముకున్నది నా కోసమే
వెన్నెల వేయి వెండి ధారలను కురిపిస్తోంది నా కోసమే
నా కోసమే పుడమి తల్లి విరి కన్నెలను పోషిస్తున్నది
వసంతాల కోకిలమ్మ వేయి రాగాలను ఆలపిస్తున్నది
నా కోసమే వేడెక్కిపోయి సూరీడు వెర్రెక్కిపోయి చంద్రుడు వేరయ్యింది
చన్నీళ్ళసెలయేరు గలా గలా పారేది పన్నీటి జడివాన జల జలా కురిసేది నా కోసమే
రంగు రంగుల సీతాకోక చిలుకలు మిల మిలల చేపపిల్లలు తళ తళల తుషారాలు నా కోసమే
కంగారు కళ్ళ జింకలు బెదురు చూపుల కుందేళ్ళు నా కోసమే
నా కోసమే నా కోసమే నా కోసమేనోచ్ .

Wednesday, May 14, 2008

చిట్టి గులాబీలు




చిరునవ్వుల వెన్నెలలు


ఎల కోయిల గిలిగింతలు


విరిబాలల పులకింతలు చిన్నారులు
వన్నె చిన్నెల సీతాకోక చిలుకలు


మిల మిల కన్నుల చేప పిల్లలు బుజ్జాయిలు
ముద్దు మాటల రామ చిలుకలు


యక్ష ప్రశ్నల బుల్లి రాక్షసులు పొన్నారులు
తులసికోట దగ్గర వెలిగే చిరునవ్వుల దీపాలు


పొద్దుటే కురిసే అల్లరి మంచు బిందువులు
వెన్నెల దొంగలు


ముత్యాల స్వరాలూ


పగడాల పెంకితనాలు


నులి వెచ్చని కోపాలు
తీపి బాణాలు వెచ్చని వాన జల్లులు


కారాల మిఠాయిలు


అమ్మానాన్నల గారాల మహారాణులు


తాతయ్య అమ్మమ్మల యువరాజులు


బోసినవ్వుల పాపాయిలు.