Sunday, February 8, 2009

మా తెలివి -- మా భవిత

మేము తెలివయిన వాళ్ళం


కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం


రేపటి భావి తరం అమ్మలను ఇవాళే కడుపుదాటి రానివ్వం


గడప దాటే అభివృద్దికి ఇవాళే మంగళహారతి పాడుకుంటాం


ప్లాస్టిక్కు కవర్లతో భూమితల్లిని


మా సూటిపోటి మాటలతో


మా జన్మకు కారణమయిన తల్లులను చీల్చి


చెండాడుకుంటాం ఎవరేమయినా అనుకోండి మాకేం


మేము తెలివయిన వాళ్ళం కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం


ఏ జాతి లోను లేని స్వజాతి వివాదాలకు మేము పట్టం కడతాం


అత్తగా కోడలిని కోడలిగా అత్తని తిట్టుకుంటాం కొట్టుకుంటాం


చదువుల తల్లులను చిరునవ్వుల చెళ్ళెళ్ళను


మా చూపుల చాకులతో చిదిమేసి మా వెకిలి చేష్టలతో


వాళ్ళ గొంతు నులిమేసుకుంటాం


మాకేం మేము తెలివయిన వాళ్ళం కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం