Tuesday, August 19, 2008

భావమా నా భావమా


నా చిన్ని గుండెలో మాయని గాయాన్ని రేపి నన్ను పిచ్చిదాన్ని చేసేస్తావు నీవు
ఏదో చెయ్యాలనే తపనని ఏమి చెయ్యలేని నిస్సహాయాతని వ్యక్తం చేయిస్తావు నీవు
నా ఆలోచనల బొమ్మలతో ఆటలాడేస్తావు
నీ వెల్లువలో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తావు
నన్నో అక్షర సముద్రంలో పడేసి అందులోనుంచి మంచి ముత్యలనేరమంటావు
అందినట్టే అంది చిక్కకుండా చేజారిపోయిన జాబిల్లిలా నన్నుడికిస్తూ
నిలవకుండా జారిపొయే చిరుజల్లులా నన్నూరిస్తూ
చేజారిపోయిన నిన్ను నేను ఉక్రోషంగా కన్నీళ్ళతో చుస్తే
చేతులనిండా బంధించలేని గాలిలా నన్ను చుట్టేసి
సేదతీర్చే సెలయేరులా ఉయ్యాలలో నాకు జోలపాడుతుంటావు
ఆఖరికి
నా చేతికి సగం అంది నవ్వుకుంటూ నన్ను వదిలి వెళ్ళిపోతావు.

4 comments:

రాధిక said...

చాలా బాగా చెప్పారు.మీరన్నట్టే కొన్ని సార్లు భావం వుంటుంది గానీ భాష వుండదు.మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది.
wordverification teeseyaruu plz

Sridevi Aduri said...

రాధిక గారు
నా కవిత మీకు నచ్చి నందుకు థాంక్సండి. నాకు బ్లాగడంకొత్త. wordverificationఎలా తీసెయ్యాలో చెప్తే తీసేస్తాను.

శ్రీ

Sridevi Aduri said...
This comment has been removed by the author.
Sridevi Aduri said...

wordverification
teeseanu chudandi