Wednesday, August 20, 2008

నా సఖుడు చందమామ


మనసంతా తన కోసం తహ తహ తమకంతో ఉగిపోతున్నవేళ
కనురెప్పలు బరువెక్కినా, నా కళ్ళ వాకిళ్ళు తనకై తెరచి యెదురుచూస్తున్నవేళ
మధురూహల పరిమళాలు విరజల్లే విరజాజులు వరహంతో వెర్రెక్కుతున్నవేళ
మిల మిలల తారలన్నీ తళ తళా మెరుస్తూన్న వేళ
దిక్కులన్నీ అతని రాకకై చీకటి పరదాలు పరుస్తున్నవేళ
సంధ్యదేవి తెలతెల్లని వెన్నెల చీరకట్టి తనకై తపిస్తున్నవేళ
ఆకాశమంతా అతని రాజసం కోసం నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నవేళ
కోటి కోరికల కలువలు మనసుల రెక్కలు విప్పి అతన్ని కొలుస్తున్నవేళ
చిరుగాలి చిరుచెమటలు చెరిపేసే వేళ
కొమ్మ కొమ్మను కీరవాణి చిగురించే వేళ
మత్తుల గమ్మత్తుల గువ్వలన్నీ గూళ్ళు చేరుకున్న వేళ
పుడమంతా తనకోసం దీపాల జిలుగులు వెలిగించుకున్న వేళ
తెల్లగా చల్లగా మెల్లగా కాంతుల వారకాంతలు తోడురాగా వస్తాడు
నా మామ శశికాంతుడు
నన్ను నిద్రపుచ్చంగా అలసిపోయిన నా మనసును
తినకుండా మారాము చేసే చంటి పిల్లల తాయిలంలా
కథలు కాణాచిలా వెండి వేల్పు
వలపు కలలకు మేలుకొల్పు.

2 comments:

Anonymous said...

కొమ్మ కొమ్మను కీరవాణి చిగురించే వేళ

దీనిభావమేమి?

కాంతుల వారకాంతలు ?

Sridevi Aduri said...

వారకాంత అంటే వెలయాలు అని అర్దం. ఇక కీరవాణి అనేది ఒక రాగం. కొమ్మలకు రాగాలునాయన్నది నా భావం.