Thursday, August 21, 2008

ప్రేమా- జ్ఞాపకం


మనసు అనే తెల్లని గోడ మీద ప్రేమ అనే పటాన్ని జ్ఞాపకాల మేకులతో తగిలించా ఎవ్వరు చూడలేరు దాన్ని నేను తప్ప పటం చిరిగినా గోడ కూలిన మేకులు మిగిలిపోతాయి గుచ్చుకుంటూ.

6 comments:

Anonymous said...

చాలా బాగుంది. thanx.

Sridevi Aduri said...

నా కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

ప్రతాప్ said...

నాకంత సీను లేదు కాని,
ఏదో చెప్పాలన్న ఫీలింగ్. కవితలోని భావం చాలా బావుంది. కాకపొతే హఠాత్తుగా చూసేసరికి అది కవిత అని అనిపించట్లేదు. కొద్దిగా శ్రద్ధ తీసుకోని రాస్తే సూపరో సూపరు.

మీ మిగతా కవితలు కూడా చదవాలి, కాస్త తీరిక చేసుకొని చదువుతాను.

Kathi Mahesh Kumar said...

హ్మ్ లోచించదగిన పదచిత్రం.

రాధిక said...

చాలా డెప్త్ వుంది.నిజమే జ్ఞాపకాలే మేకులు.మేకులు ఊడిపోయినా మచ్చ మిగిలిపోతుంది.జ్ఞాపకాలు చెరిగిపోయినా ఎప్పుడోకప్పుడు ఆ మచ్చ బయటపడుతుంది.

Sridevi Aduri said...

ప్రతాప్ గారు,

నేను కవితలు రాయగలనా అనేది నాకు కూడ ఎప్పటికి తేలని సందేహమె సుమండి.

మహేష్ గారు,

ఆలోచించేంత సమయం నా భావం నాకివ్వదండి. త్వరగా దాన్ని పట్టక పోతే మరి జారి పొయే జలపాతంలా ఉరికి పోతుంటుంది

రాధిక గారు,

థాంక్సండి