Thursday, August 21, 2008

గుర్తొస్తావు


ఏమెరుగని స్వచ్చతను చుస్తే నువ్వు గుర్తొస్తావు
అందరికి సమానంగా పంచే వెన్నెల ను చుస్తే నువ్వు గుర్తొస్తావు
మౌనముని బుద్ధుడి వికసిత నేత్రాలు చుస్తే నువ్వు గుర్తొస్తావు
హటాత్తుగా నా మనసులో అలజడి రేకేత్తిస్తావు
పువ్వులోంచి జారిపడ్డ పుప్పొడిని చూసినప్పుడు నువ్వు నీ నవ్వు గుర్తొస్తాయి
ఆకాశం లో నుంచి నా గుండెల్లోకి రాలిపడ్డ మంచు ముత్యనివై నీవు గుర్తొస్తావు .

3 comments:

Anonymous said...

చాలా బాగుంది

Sridevi Aduri said...

నా కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

ప్రతాప్ said...

ఎక్కడో, ఏదో ఇంటర్వ్యూలో ఆరుద్ర గారిని ఎవరో అడిగారు, "మీ మొదటి పాటకి, ఇప్పుడు మీరు రాస్తున్న పాటకి తేడా ఏంటి?" అని, దానికి ఆయన ఇచ్చిన సమాధానం, "కొద్దిగా స్వచ్చత, కొద్దిగా అమాయకత్వం, మెండుగా భావుకత్వం. ఇదే ఆ తేడా" అని చెప్పారంట. మీ కవితలు చూస్తుంటే నాకు మొదట కవితలు మొదలుపెట్టిన నేనే గుర్తొస్తున్నాను. మీ భావాలు చాలా బావున్నాయి. కాకపొతే కొద్దిగా శ్రద్ధ తీసుకోని రాయండి, ఇంకా చాలా బావుంటాయి.