Thursday, August 21, 2008

చిరు గాలి


సన్నటి గాలి తెమ్మెర మెల్లగా
నా మేనును తాకుతూ ...
నా చెవిలో ఏదో గుస గుసలాడుతోంది
సన్న జాజి తీగతో ఆటలాడుతూ,
దాన్ని మాటి మాటికీ కదిలిస్తూ ..
మొగ్గలను నవ్విస్తోంది .
అబ్బబ్బ ఎంత అల్లరో !
చిలిపి గాలి చిన్నగా నా చెంతకు చేరి
నా దారిని ఏమార్చేస్తోంది .
ఏవో తెలియని ఉహల్ని నాలో రేపి
నన్ను ఒంటరిగావదిలెళ్ళిపోయింది..

6 comments:

రాధిక said...

చిరుగారి అంత కష్ట పెడుతున్నా మీకు కోపం రాలేదా :)
కొన్ని కష్టాలు ఇష్టం గా వుంటాయి అంటారా?...అయితే ఒకే

Kathi Mahesh Kumar said...

వాక్య నిర్మాణం కాస్త గంగరగోళంగా ఉంది. సర్ చూసుకుంటే చదవడానికి ఇంకా సులభంగా, ఇంపుగా ఉండేది.భావం బాగుంది.

Anonymous said...

ayya baboi.....chiru gaali kaasta TV channels vallla baaga kampu kodutundi ippudu.
kaani me poem baagundi!

Sridevi Aduri said...

రాధిక గారు,

మీ చెంగును చిరుగాలి ఎన్నడూ లాగలేదాండి. ఏమి చెయ్యగలము చెప్పండి. కానీ నాకిలాంటి కష్టాలంటే చాల ఇష్టం సుమండి.

మహేష్ గారు,

గందరగోళాలు, చిందరవందరలు, అప్పుతచ్చులు, తప్పటడుగులు మొదటిలో తప్పవేమోనండి
సత్యభామ గారు,

థాంక్సండి

Rajendra Devarapalli said...

సన్నటి గాలి తెమ్మెర మెల్లగా
నా మేనును తాకుతూ...
నా చెవిలో ఏదో గుస గుసలాడుతోంది
సన్న జాజి తీగతో ఆటలాడుతూ,
దాన్ని మాటి మాటికీ కదిలిస్తూ..
మొగ్గలను నవ్విస్తోంది .
అబ్బబ్బ ఎంత అల్లరో !
చిలిపి గాలి చిన్నగా నా చెంతకు చేరి
నా దారిని ఏమార్చేస్తోంది .
ఏవో తెలియని ఉహల్ని నాలో రేపి..
నన్ను ఒంటరిగావదిలెళ్ళిపోయింది.. ఇలా విడగొట్టి చూడండి శ్రీదేవి గారు,ఇంతకీ ఈ పిల్ల మన్మధుడెవరు? :)

Sridevi Aduri said...

Rajendra gaaru,

Thanks so much for your suggesions.
will do like that only

Srilu