Wednesday, January 12, 2011

పదహారేళ్ళ ప్రాయం


లేత అరచేతిలో పెట్టిన గోరింటాకు 
బుగ్గల్లో పండే వైనం 
చిలిపి కళ్ళతో మనసులను 
గిల్లే పరువాల ప్రాయం 
తుళ్ళింతల కెరటాలు పైకెగసి పడే సందేహాల సంద్రం 
గోదారొడ్డున ఇసుక తిన్నెల్లో దొరికే 
గువ్వరాళ్ళ గందరగోళం 
అన్నీ తమకే తెలుసనే నడమంత్రపు సిరుల సైన్యం
వెన్నెల లో మెరిసి 
పాలల్లో తడసి 
మిణుగురులై ఎగసి 
చినుకులలో వెలిసి 
తేనెల్లో విరిసి 
తొలిపొద్దున కురిసే
మంచుబిందువులై నునులేత సూర్య కిరణాలకే
కరిగి నీరయిపోయి 
పదహారేళ్ళ ప్రాయం

3 comments:

చెప్పాలంటే...... said...

simple gaa baavundi

భావకుడన్ said...

శ్రీగారు

మధ్యలో కొన్ని పంక్తుల మీద కృషి చేసుంటే శిల్పం ఇంకా బాగా వచ్చేది. వాటిలో పద, భావ గరిమ కింద పాపం లయ ఎక్కడో నలిగిపోయింది

అందామనుకున్నాను చూడంగానే.


కాని
పదహారేళ్ళ వయసు గోప్పలూ
ఆ వయసులో ఉండే లోపాలూ

ఇలా మీ కవితా శిల్పంలో (పదాలూ, భావంలోనే కాకుండా)చక్కగా ప్రతిబింబింపబడ్డాయి.I think this was an apt style for a confused teen age year's poem. అని కొంచామాలోచిస్తే తోచింది.

అనుకుని రాసారో, అనుకోకుండా పాకమబ్బిందో కాని సూపర్బ్.

veera murthy (satya) said...
This comment has been removed by the author.