ప్రేమంటే ...
అమ్మ నీకిష్టమయిన వంట కోసం పడే ప్రతి రోజు శ్రమ ...
నాన్న నీకు ఇవ్వాల్సిన బహుమతి కోసం అనుదినం అదనంగా చేసే పొదుపు, మదుపు ..
అది చిలిపి తగాదా అయినా సరే...అన్నో అక్కో నీతొ గడిపే అమూల్య క్షణం ..
తాతయ్య అమ్మమ్మ నీ సెలవుల కోసం ఎదురు చూసే మధుర అనుభూతి...
ప్రతిఫలం ఆశించకుండా వీచేగాలిది ..
పూచే నీ పెరటి పువ్వుది ..
నీకు గొడుగు పట్టే అంబరానిది ..
అనుక్షణం నిన్ను మోసె భూమిది ..
ఎప్పుడు నీకు అండగ ఉండే నేస్తానిది ..
ఆ తరువాతే ... ఇంకా ...
ఇంకా నీకు అదృష్టం ఎక్కువయితే దేవుడు పంపే తోడుది...
మరి ప్రేమంటే ఒకటె అర్థం ఇస్తారెందుకో ??
నాకు అస్సలు నాకర్థం కాదు. :(
4 comments:
Premanta.. Naaku kuda.. Artham kaledu...
Premanta.. Naaku kuda.. Artham kaledu...
అదిరింది. :-)
ప్రేమకి అర్ధం మనల్ని ప్రేమించేవారి నుండి తెలుసుకోవచ్చని చక్కగా చెప్పారు .బావుందండీ !
Post a Comment