Friday, September 5, 2008

ఆ తీరాన నువ్వున్నా


నా మమతల అనురాగాలుకట్టి మబ్బులతో కబురంపాను ..
నీవున్న చోట వర్షించాయా !
నా మురిపాల విన్నపాలన్నీ గువ్వమ్మలకి అందించాను ..
నీకు కువ కువల కబురులు అందించాయా !
నా పంటి బిగువుల చిట్టి పొట్టి అలుకలు సూర్యునితో వివరించాను ..
తొలి పొద్దు నులివెచ్చని కిరణాలు నీపై ప్రసరించాడా !
నా రహస్యాల విలాసాలన్నీ చిరుగాలిలో కలిపేశాను ..
హోరున నిన్ను కమ్ముకున్నాయా!
నా ఉడుకుమోతు తనాల కన్నీళ్ళని చినుకులలో వంపేసాను ..
జోరున నీపై వర్షించాయా !
నా నవ్వుల సౌరభాలన్నీ ప్రతి మొగ్గలోను పొట్లం కట్టి పంపించాను ..
నీవున్న చోట విచ్చుకుని వినిపించాయా !
రాసి పంపలేని వివరాలన్నీ తుషారాలలో నింపెసాను ..
ఆకులపై లేఖలు రాసి నీకు అందించాయా !
వేయి కన్నులతో నీకై ఎదురుచూస్తున్నానని చుక్కమ్మలకు చెప్పేసాను ..
నీకు మినుకు మినుకు దారులు చుపించాయా!
ఆ తీరాన నువ్వున్నా
ప్రతి నిమిషం నీకై తపిస్తున్నా !!



2 comments:

సమిధ ఆన౦ద్ said...

మహాద్భుత౦గా ఉ౦ది మీ కవన శ్రీదేవిగారు. ప్రకృతికి ప్రేమకి తేడాలేదని చూపారు.మీ లేఖలు తేనెలో ము౦చిన సున్నితపు బాకులు. Very nice. I loved it!

Sridevi Aduri said...

dhanyavaadaalu
Sreelu