Wednesday, September 17, 2008


మనసుల భావాలున్నా
కనులకు కలలున్నా
నిద్ర పోతున్న నేస్తం
చుట్టూరా చీకటి ఉన్నా
నా చిరునవ్వుల జ్యోతిని వెలిగిస్తాను.
మౌనంలో నువ్వు మునిగిపోతున్నావు
నేను నా మాటల తీరానికి చేరుస్తాను.
వస్తావా నాతో
తుమ్మెద రెక్కల విమానమెక్కి
పూవుల పుంతలు వెతుక్కుందాం.
తడి ఇసుకలో పాదాల ముద్రలేసుకుంటూ
గువ్వ రాళ్ళ జాతి వజ్రాలేరుకుందాం.
సెలయేరుల గమ్మత్తు గమకాల సరిగమలు నేర్చుకుందాం.
ఒక్కసారి మళ్ళీ పసితనాల వీధులలోకి వెళ్లి
అల్లరి చేష్టల అలల జ్ఞాపకాలు నెమరేసుకుందాం ...


2 comments:

MURALI said...

బాగుంది.

kRsNa said...

ఒక్కసారి మళ్ళీ పసితనాల వీధులలోకి వెళ్లి
అల్లరి చేష్టల అలల జ్ఞాపకాలు నెమరేసుకుందాం. chaala bagundi ee expression. abhinandanalu. :)