తొలి కిరణాలు ఆర్తిగా నన్ను తడిమే వరకు ..
జోరున చందురుడు నాపై వెన్నెల వాన కురిపించేంతవరకు ..
గాలి కెరటాలు నాపై విసురుగా దుకేవరకు ..
నా కొప్పున మల్లెలు గుప్పున నవ్వేవరకు ..
నా వేలి కొసల ఆజ్ఞలు సాగేవరకు ..
నా కాలి మువ్వలు ఝల్లుమని మ్రోగేవరకు ..
నా నులి వెచ్చని కోపాలతనిలో పెను సెగలెగసే వరకు ..
నా గాజులతని చెవిలో రహస్యాలు చెప్పేవరకు ..
నా మాటల మురిపాలతన్ని అలరించేవరకు ..
అలసిన అతని మనసుకు నేనోదార్పయ్యేవరకు ..
నేను నెరజాణనే !
నా వసంతుని కొలిచే వన కన్యనే !
మరి , ముసలిదన్నయ్యనా అదెలాగూ !!
5 comments:
nice one..
WOW!.. Just loved it.
Thanks
WOW and a WOW!
Brilliant! Loved it to the core!
వసంతుని కొలిచే వన కన్యనే !ఇక్కడ కొట్టారు దెబ్బ
బాగుందండి నాకు చాలా నచ్చింది.మీరజాలగలడా అన్న సత్యభామ ధీమా చూయించారు :)
జాణతనమంతా కలబోసి జలజలా రాల్చినట్లుంది ఈ కవిత..
చాలాబాగుంది.
Post a Comment