Wednesday, May 14, 2008

చిట్టి గులాబీలు




చిరునవ్వుల వెన్నెలలు


ఎల కోయిల గిలిగింతలు


విరిబాలల పులకింతలు చిన్నారులు
వన్నె చిన్నెల సీతాకోక చిలుకలు


మిల మిల కన్నుల చేప పిల్లలు బుజ్జాయిలు
ముద్దు మాటల రామ చిలుకలు


యక్ష ప్రశ్నల బుల్లి రాక్షసులు పొన్నారులు
తులసికోట దగ్గర వెలిగే చిరునవ్వుల దీపాలు


పొద్దుటే కురిసే అల్లరి మంచు బిందువులు
వెన్నెల దొంగలు


ముత్యాల స్వరాలూ


పగడాల పెంకితనాలు


నులి వెచ్చని కోపాలు
తీపి బాణాలు వెచ్చని వాన జల్లులు


కారాల మిఠాయిలు


అమ్మానాన్నల గారాల మహారాణులు


తాతయ్య అమ్మమ్మల యువరాజులు


బోసినవ్వుల పాపాయిలు.





2 comments:

pruthviraj said...

చిన్నపిల్లలా చాలా బాగా గబగబా చెప్పారు.superb.

Sridevi Aduri said...

వర్మ గారు,

ధన్యవాదాలు. నేను మీ బ్లాగు చూసాను. చాలా బావుంది.