Tuesday, November 15, 2011

వేకువ వరద

పసిడి బుగ్గల పయిన కెంజాయ రంగులో ఆకాశం కెంపుల మాలలా మెరుస్తుంది 
బద్ధకంగా వళ్ళు విరిచుకుంటూ పిట్ట ప్రియురాళ్ళు ..
కొమ్మ  బాహువుల్లోంచి సిగ్గుల పరదాలు తీసి హటాత్తుగా పయికెగురుతాయి .. 
విడ లేక విడిపోతూ ..గుస గుసల కువ కువలతో
పాల కోసం పరుగెత్తే తువ్వాయిల్లా.. 
వెచ్చని సూర్య కిరణాలు పుడమి తల్లి ముంగిట పారట్లాడుతుంటాయి  ...
చిగురు చిగురు నీ తడిమి వలపు కెరటాలై ముంచి పువ్వుల నవ్వుల్నీ విరగ బూయిస్తాయి.. 
నేను ముందంటే .. నేను ముందంటూ తోసుకోచ్చే ప్రతీ కిరణమూ.. 
ఒక్కో పిడిబాకై నిదుర  కన్నుల్లో పొడుస్తూ ..
అమ్మ చెరగులో దాగున్న ప్రతీ ప్రాణినీ లే లెమ్మంటూ ఉదయ రాగాలు ఆలపిస్తాయి.
కొంటె సూరీడు చుక్క పొద్దుల చీకటి చీల్చి పుట్టుకొస్తాడు 
రోజుకో కొత్త మొదలుతో 
మత్తు కౌగిళ్ళు వీడిన కళ్ళు రెండు పత్తి కాయలై విచ్చుకుంటాయి ..
చీకటి మౌనాన్ని విడిచి భూమి వెలుగు చీరను చుట్టుకుంటుంది 
వేకువ వరదలా వచ్చి లోకాన్ని అల్లుకుంటుంది ..

3 comments:

Padmarpita said...

Nice kavita...

జ్యోతిర్మయి said...

మీ కవితలన్నీ చదివాను శ్రీ..మీ భావుకత అత్భుతంగా ఉన్నది. ఇంత బాగా వ్రాయగలిగిన మీరు తరచుగా వ్రాస్తుందండి. ధన్యవాదములు.

Unknown said...

చీకటి మౌనాన్ని విడిచి భూమి వెలుగు చీరను చుట్టుకుంటుంది
వేకువ వరదలా వచ్చి లోకాన్ని అల్లుకుంటుంది ..
మీ భావుకత కి హాట్స్ఆఫ్ అండీ.