Thursday, May 5, 2011

మరో సారి మన్నించ వూ ?

ఓ క్షణం నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది
అలసిపోయిన నా కనులకు జోలలు పాడే నీ పెదవుల సరిగమలు వింటూ నిదురపోవాలని ఉంది
నీ చూపులకు తెరలడ్డు పెట్టే నా ముంగురులు సవరించే నీ చేతి వేణువుల ను పెనవేయాలని ఉంది  
ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది 
నే చేసిన తప్పులను సవరిస్తూ బుద్దులు చెప్పే నీ పెద్దరికానికి మరోసారి తలవంచాలని ఉంది 
అల్లరి చేస్తూ నీ చేతికి అందకుండా పారిపోయినప్పుడు ఉడుక్కునే నీ కళ్ళలో వేడి కి  ఆవిరై పోవాలని ఉంది
కోప్పడుతూ కళ్లురిమి చూసే చూపుల చురకత్తుల దాడికి విల విల్లాడి పోగలను కాని
మౌనం వీడి నా మనసుకు ఓదార్పు నీయవూ?
కరిగి జారిపోయే నీ చెలిని నీ ఎద వంపులో తల దాచుకోనీయవూ ?
వేడు కుంటున్నాను ప్రియా
నన్ను మరో సారి మన్నించ వూ ?

4 comments:

చెప్పాలంటే...... said...

chaalaa baagaa raasaaru kavita chaalaaaa baagundi

Rao S Lakkaraju said...

చదువుతుంటే ఎక్కడికో తీసుకు వెళ్తోంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

Unknown said...

ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది
ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను మీ కవితలు.చాల బాగా రాస్తున్నారు.

Rao S Lakkaraju said...

ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది
-----------
kallurisailabala గారూ కవితకు తగిన చక్కని కామెంట్ పెట్టారు.