ఏమి చూపే అది చిత్రాల మారాణి
సూటిగా నీ చూపు నాటింది తుమ్మ ముల్లోలే
గుండె గుబ గుబ లాడి ప్రాణం విల విల్లాడి
ఒడ్డున పడ్డ చాపోలె పోర్లాను
పూసంత నవ్వితేనే పున్నములు పూస్తే
బంతి పువ్వులాగా యిరగబడి నవ్వితే
ఏమయ్యిపోవాల ఏడేడు లోకాలు ??
ఏమి చూపే అది చిత్రాల మారాణి
గోగు పుల రైక గుత్తు పూలా చీర గుత్తంగా నువ్వు కట్టి
గట్టు ఎమ్మడి గున గునా నడుత్త ఉంటే
రెండు కళ్ళు సాలవు నీ వయ్యారాల జిలుగును చూడంగా
గడ కర్రలగా నిట్రాట నై పోతి
ఆకుల్లో కొమ్మల్లో నడిసేటి దారుల్లో
ఎలిగేటి సూరీడు రేకల్లో
కడాకు వెంట నడిసేటి నా నీడ లో సైతం నిన్నే సూత్తున్నాను
ఏమి చూపే అది చిత్రాల మారాణి
కొప్పులో చామంతి దిక్కు తెలియక రాలిపోయే
దండ కడియాల నీకాళ్లు నడిచిన నేలంతా
కదలక మెదలక ఒక్కచోటే ఉండిపోయే
నాకేసి సూత్తా నవ్వు ఇసిరేసి పోయావు
రేయంత దిగులు పగలంతా సెగలు
ఏమి చూపే అది చిత్రాల మారాణి
చూపులోనా చురకత్తి బాణాలు
నడక లోన నవ్వేటి జలపాతాలు
కలువ పూల కళ్ళు కాటుక భరిణో లే
నడుములో నెలవంక కరిగి జారి పోయే
ఏటి వడ్డున ఉన్న కోవెల్లో కోనేరల్లె
కలువ పూల కళ్ళు కాటుక భరిణో లే
నడుములో నెలవంక కరిగి జారి పోయే
ఏటి వడ్డున ఉన్న కోవెల్లో కోనేరల్లె
ఒక చోట ఉండలేను నీదరికి చేరలేను
ఎంట పడి తరిమేటి నీ చూపునాపలేను
ఎంట పడి తరిమేటి నీ చూపునాపలేను
ఏమి చూపే అది చిత్రాల మారాణి
4 comments:
బాగుంది.
chaalaa bagundi.... thank you
Chala chala bagunnay.. mee collections
ఎంట పడి తరిమేటి నీ చూపునాపలేను
ఏమి భావుకత..హాట్స్ ఆఫ్ మీకు.
Post a Comment