Thursday, March 17, 2011

అల్లరి మావా

తుంటరి నా మావా తలపుల్లో మునిగి

తెప్ప రాక కోసం తిప్పలు పడతాంటే

కొంటె గాలి వచ్చి పయిట లాగేస్తాందే

ఏటి నీళ్ళ నడిగి బదులేమీ రాక

మొగము తిప్పుకొని తిక మకలు పడుతుంటే

వెన్నెల మారాజు వేడి మంటలతోటి వలపు సెగ రాజేసే

కదల లేని దండ కడియాల కాళ్ళు ముడివేసి కూర్చున్నా

రెప్పలార్ప లేని కళ్ళు సెగల నార్పలేక

చింతపడి కూర్చుంటే ...

మల్లెల దండ ముడవలేదని అలిగి అందాల నా కొప్పు అలిగి జారిపోయే ..

రాడేమి నా మురిపాల మావా

ఇంకా రాడేమి నా అల్లరి మావా ..

7 comments:

Padmarpita said...

chaala baagundandi.

akanksha said...

janapadanni jodinchi chala baga rasaru.....ammmayi tana maama kosam eduru chudadam anedanni chala andamga varnincharu

Lakshmi Raghava said...

ఎంత బాగుందో !!!!!

మాలా కుమార్ said...

శ్రీ చాలా బాగారాసారు . జానపదం లోని సొగసును చూపించారు .
థాంక్ యు .

జయ said...

ఎంత మంచి బ్లాగ్ అండి. ఇంతకాలం చాలా మిస్ అయ్యాను. ఎన్ని కవితలు, ఎన్ని రకాల రచనలు. మా అక్క చెప్పక పోతే నాకస్సలు తెలిసేదే కాదు. చాలా బాగున్నాయండి. ఇంకనుంచి నేను మీకు రెగ్యులర్ రీడర్.

శ్రీలలిత said...

మీ కవిత చదువుతుంటే అక్కడే వున్నంత అనుభూతి కలిగింది.. చాలా బాగా రాసారు..

జ్యోతి said...

శ్రీలు,, ఇంతకీ ఆ అల్లరి మావ జాడేమైనా తెలిసిందాలేదా?? ఓ ఫోన్ కొట్టు పరిగెత్తుకు వస్తాడు ఎక్కడున్నా.