నువ్వు రాలేని దూరమని తెలిసి నీ కోసం తీయని తలుపుల వెనుక నిలబడి ఎదురు చూస్తుంటాను !!
నువ్వున్న చోటుకి చేరుకోలేనని తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తుంటాను
నీకు నాకు మధ్య యుగాల వైరం కొలవలేనంత మౌనం వెలుగే లేనంత చీకటి
దాటలేని లోయల మధ్య తెంచు కోలేని బంధాల మధ్య బందీనై ప్రతీ క్షణం ఆక్రోశిస్తుంటాను
ఎక్కడో నువ్వున్నవనే వెర్రి ఆశతో నా ఉనికిని గుండె గా మార్చి సడి నీకు వినిపిస్తుంటాను
నిన్ను చేరే ఘడియల కోసం నా ఉపిరి దారంతో కాలాన్ని కొలుస్తున్నాను
1 comment:
"నా ఉపిరి దారంతో కాలాన్ని కొలుస్తున్నాను" chaala baagundi andi ee line naaku.
- Srikar
Post a Comment