Thursday, October 21, 2010

నేను నువ్వయ్యి మురిసిపోతాను

పొద్దుటే పొడిచే సూర్య కిరణాలు నీ కొంటె చూపులను గుర్తు చేస్తాయి 
నుదుటన దిద్దే తిలకం నీ మోముని చుపిస్తున్దేమిటి ?
నీ గుప్పిటలో బిగిసిన చేతిని గాజులతో మూసేస్తానా 
గల గలమని గాజులు నవ్వుతుంటాయి ఆ  తలపును గుర్తు చేస్తూ 
సిగలో ముడిచిన జాజుల దండ నీ పరిమళం అయ్యి  చుట్టూ ముడుతుంది ఏమిటో 
ఎటు నడిచిన నువ్వు వెనుక రావటం లేదేమని 
ఘల్లు ఘల్లున గొల్లుమంటాయి మువ్వల పట్టీలు 
దిగులుగా జీరాడే చీర కుచ్చిళ్ళు మరింతగా ముడుచుకు పోతాయి 
అల్లంత దూరాన నిన్ను చూసి సూరీడు గబుక్కున ఇంటికెళ్ళి పోతాడు 
సందురుడు సంబరంతో చుక్కల అంబారి ఎక్కి వెన్నెల జలకాలాడుతాడు
ఆశ్చర్యంగా ఇంతవరకు నేనులా ఉన్న నేను నువ్వయ్యి  మురిసిపోతాను