నా కనుపాపలు నీ స్వప్నాల పాపాయిలు జారిపోకుండా కాపలా కాస్తుంటాయి
వెన్నెల్లో విరహిణిలా కిటికీ పక్కని సన్నజాజి తీగ జాలిగా నాకేసే చూస్తుంటుంది
వెన్నెల వేయి చేతులతో వేవేల చలువ కిరణాల వాడి బాణాల్నినాకేసి గురిపెట్టి
గుండెలను చీలుస్తుంటుంది
పరాగ్గా వీస్తున్న చల్లగాలి సయితం బగ్గు బగ్గున మండుతూ వెర్రి కేకలు వేసి నన్ను
గిర గిర తిప్పి విసిరేస్తుంటుంది
కొంటె మల్లెల దండ ముళ్ళ పళ్ళ నోళ్ళు తెరిచి నన్ను వెక్కిరిస్తుంది
ఉన్నంత మేర ఆకాశము నేను ఒంటరిగా మిగిలిపోతాం
అపుడెపుడో అరక్షణం క్రితం అలిగి వెళ్ళిపోయిన నువ్వు ఇక మరి రానే రావు
3 comments:
good one anDi,
బాగుందండి!
aakasamu nenu ontariga migilipotham..
Baagundi...
Post a Comment