Thursday, April 29, 2010

ఉహల పరిమళాలు

మధుర ఊహలు - సుమధుర పరిమళాలు
వెచ్చని ఉదయాలు - చల్లని సాయంత్రాలు 
గుప్పెడంత మల్లెలు - గుండెంతా సౌరభాలు 
నిలవలేని వెన్నెలలు - ఓపలేని విరహాలు 
ఆపలేని కలలు - చేరుకోలేని దూరాలు 
ఆగని కాలాలు - పెరిగే లక్ష్యాలు 
విడతీయలేని బంధాలు  - మరపురాని జ్ఞాపకాలు 
ఈ చివర నేను -- ఆ చివర తానూ 

Wednesday, April 28, 2010

గెలుపు - రెసిపి


ముందుగ కొంచెం నిరాశ
ఆ తరువాత చాల కొంచెం నిస్పృహ

ఓపలేనంత బరువు
తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు
చేరలేనంత దూరం
చెప్పలేనంత దిగులు

ఎటు చూసిన హేళనలు ,
అక్కర్లేని సానుభూతులు
మింగలేనంత చేదు అనుభవాలు

మరి కొంచెం దూరం ఉందనగా
మొట్టమొదటి అపజయం
తరువాత హాలాహలం
అపజయాల వెల్లువ
జారిపోతున్న మెట్లు
అఘాదాలు

అలుపెరుగని నీ కష్టం
వెల కట్టలేని నీ ధైర్యం
నీతో తోడుగా సాగిపోతుంటాయి

అదిగో అక్కడ ఈ అపజయాల మెట్ల పయిన
కష్టాల కడలి అవతల
విజయం .. నీ తొలి గెలుపు ...

ఇప్పుడు నీకు అపజయం విజయానికి తొలిమెట్టని
తెల్సిపోయిన్దోచ్...

ఇక నిన్నెవ్వరూ ఆపలేరు అడ్డుకోలేరు
నీకు నీ శ్వాస ధ్యాస ధైర్యం లక్ష్యం చాలు
మరిన్ని మెట్లు జారుతూ ఎక్కుతూ
పై పైకి చేరుకుంటూ.

ఎండలు

కలువ కాంతలూ
వెన్నెల కాంతులు
విరజాజుల పరిమళాలు
మల్లెపూల మాలలు
మనసునిండా మధురూహలు
మండించే ఎండలు ..

తొలకరి జల్లులకై ఎదురుచూపులు
ఎంచక్కా రావచ్చుగా ఇంకా చిట్టి పొట్టి చినుకులు