Tuesday, November 10, 2009

మనసా .. కాస్త ఆగవే ..

మరి మరి అడుగకు గుచ్చుకునేలా !!
చూపుల విరి తూపులకు మనసు విచ్చుకునేలా ..
కౌగిలంతలడుగకు సిగ్గుపడేలా!!
కవ్వింతల పులకింతలు తుళ్ళిపడేలా ..
మరుమల్లెల విరి తావులు మెరిసిపొయేలా ..

మరి మరి అడుగకు మురిసిపొయేలా !!
విరహాల వాకిళ్ళు తెరుచుకునేలా..
వెన్నెల చెమరింతలు గుండెల్లో పరుచుకెనేలా..

2 comments:

నీహారిక said...

శ్రీలు,
ఏమయిపోయారు? ఈ మద్యన వ్రాయటం లేదు.

Srikar said...

మరి కాంప్లెక్స్ పదాలు వాడకుండా ఈ సారి మాపై దయతలిచారు !