ఆకాశం నుండి రాలాయి మంచి ముత్యాలు ...
పుడమితల్లి మెడలో హారంగా ;
రైతన్నల గుండెల్లో పసిడి వరంగా,
రాబోయే మొలకలకు ఆహ్వానంగా,
ఎన్నో ముత్యాల సిరులు !
ఎటు చుసిన ఆనందమే
ఎటు చూసినా సంతోషమే
ఏదో తెలియని హాయి
ఇన్ని రత్నాలు ఒలికించి మురిపాలు కురిపించి
మరెన్నో బతుకులను పండించగలననే కామోసు !
ఆకాశానికి అంత బడాయి!!
పుడమితల్లి మెడలో హారంగా ;
రైతన్నల గుండెల్లో పసిడి వరంగా,
రాబోయే మొలకలకు ఆహ్వానంగా,
ఎన్నో ముత్యాల సిరులు !
ఎటు చుసిన ఆనందమే
ఎటు చూసినా సంతోషమే
ఏదో తెలియని హాయి
ఇన్ని రత్నాలు ఒలికించి మురిపాలు కురిపించి
మరెన్నో బతుకులను పండించగలననే కామోసు !
ఆకాశానికి అంత బడాయి!!
4 comments:
అవును ఆ బడాయివల్లనేనేమో అందకుండా పైకెక్కి కుర్చుంది.
చలా బాగుందండి.
ఆకాశ౦ మీద మీ బడాయిని చూపి౦చారుగా. భలే ఉ౦ది ఈ ప్రయోజనకర ప్రయోగ౦.
ధన్యవాదాలు
శ్రీలు
బడాయి కాదా మరి ఆకాశం అందనంత ఎత్తున్నా ... నాకు గొడుగు పడుతోందిగా.. ఏమంటారు.
శ్రీలు
Post a Comment