నీ నవ్వు మువ్వలా మోగుతుంటే
గుండె గడియారం ఝల్లుమంది
నీ మాట పాటయ్యి మురళిలా సాగుతుంటే
విన్న హృదయం ఘల్లుమంది
మనసు మల్లెల నావయింది
ప్రేమ యేరువాకయింది
ఆ తేనెల తుంపరలో
మునకేసిన ప్రతి సారి
జ్ఞాపకం పచ్చ బొట్టులా
తేలిన ప్రతి సారి
విరహం కారు చిచ్చులా
రెండూ సెగలు రగిలించేవే
నీ ముద్రలు మిగిలించేవే
రగిలి పొగిలి ఏడుస్తానో
హరివిల్లయి విరబూస్తానో
ఎద సవ్వడిని ఆపలేను
నాలో వెల్లువనూ ఆపలేను
నేనుగా మిగలలేను
నువ్వుగా మారనూలేను
ఈ వలపు పందెంలో
ఎవరు గెలుస్తారంటావు ?
నా నువ్వా??
లేక నీ నేనా ??