ఎవ్వరాపగలరు నీ గమనాన్ని
గాలికి ఎగిరి కాలికింద నలిగినా
ఓటమి ఎరగని విత్తనం అయ్యి
భూమిని చీల్చుకు వచ్చే మొలకలాగా
నువ్వు ఎదిగిపోతుంటే
ఎవ్వరు అడ్డుకోగలరు నీ గమ్యాన్ని
విసిరేసిన గోడకేసి కొట్టిన
తిరిగి పయికేగిరే బంతిలాగా
నువ్వు తిరగబడుతుంటే
ఎవ్వరు ఎదుర్కోగలరు నీ సహనాన్ని
నువ్వు నిరంతరం చావు తో చేసే
ఊపిరి పోరాటాన్ని ఆపనంతవరకు
ప్రతి నిమిషం నీ లక్ష్యాన్ని మరవనంతవరకు
ఎవ్వరు ఆపగలరు నీ విజయాన్ని