Sunday, April 19, 2009

ఒంటరితనం

నీతో నువ్వు నీలో నువ్వు నీకై నువ్వు నీలా నువ్వు ఉంటే ఒంటరితనమేలా

అందరితో నువ్వున్నా నీకై ఎవరూ లేక పోవటం ఒంటరితనం

నాకెవ్వరు అవసరం లేదనుకుంటే అహంకారం

నీకెవ్వరు లేరనుకోవటం అంధకారం

Tuesday, April 14, 2009

విజయం

నిన్నటి నీ బలహీనతల మీద నువ్వు చేసిన యుధ్ధం తాలుకూ పరిణామమే ఇవాల్టి విజయం
ప్రతి క్షణం నువ్వు పుట్టుకనుంచి చావుకి చేసే ప్రయాణమే జీవితం

Thursday, April 9, 2009

పాటల సందడి - కల కానిది

కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

కల కానిది

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగా
జాలి వీడి అటులే దాని వదలి వైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా

కల కానిది

అలముకున్న చీకటిలోనే అలమటించనేల
అలముకున్న చీకటిలోనే అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలవరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

కల కానిది

అగాధమౌ జలనిధి లోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖము న్నదిలే
అగాధమౌ జలనిధి లోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖము న్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం

కల కానిది

ఎంతో విలువలున్న ఈ పాటంటే చాలా ఇష్టం నాకు. కష్టాలు వచ్చినపుడు గుండె నిబ్బరం చేసుకొమ్మని ఒక నేస్తం దారి చూపినట్లుండే సాహిత్యం కమ్మగా సాగే పాట ఎప్పుదు విన్నా నాకు ఆ స్పూర్తి తో ముందుకి సాగిపొమ్మని నా ఆత్మీయులు సలహా ఇచ్చినట్లనిపిస్తుంది.

మరి ఈ పాట వినాలంటే ఈ లింకు లో వినొచ్చు

Thursday, April 2, 2009

పారే యేరు నువ్వేనా??

నీకు కష్టం వచ్చినపుడు హిమాలయాలంత నిబ్బరంగా ఉండు.

ఎదుటివారికి కష్టం వచ్చినపుడు గల గలా పారే యేరులా ప్రవహించు.

నా బ్లాగు వీక్షకులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు