Tuesday, January 18, 2011

సిరిమువ్వల నా నువ్వు



సుమధుర భావాలను కనురెప్పల కుంచెలతో గుండెపై చిత్రిస్తావు
గుండె చప్పుడు లో ని గుబులును గుస గుసలుగా మర్చి నా చెవులకు వినిపిస్తావు  
చిరు నవ్వు ల చురకత్తి తో అనుక్షణం దాడి సాగిస్తావు 
వాడి నిట్టూర్పుల వేడి తో మంచులో సైతం సెగలు రగిలిస్తావు 
నీ కనుల  సెలయేటిలో పడిన ప్రతి సారి వేయి సార్లు జన్మిస్తాను 
నను దాటి నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తాను 

Wednesday, January 12, 2011

పదహారేళ్ళ ప్రాయం


లేత అరచేతిలో పెట్టిన గోరింటాకు 
బుగ్గల్లో పండే వైనం 
చిలిపి కళ్ళతో మనసులను 
గిల్లే పరువాల ప్రాయం 
తుళ్ళింతల కెరటాలు పైకెగసి పడే సందేహాల సంద్రం 
గోదారొడ్డున ఇసుక తిన్నెల్లో దొరికే 
గువ్వరాళ్ళ గందరగోళం 
అన్నీ తమకే తెలుసనే నడమంత్రపు సిరుల సైన్యం
వెన్నెల లో మెరిసి 
పాలల్లో తడసి 
మిణుగురులై ఎగసి 
చినుకులలో వెలిసి 
తేనెల్లో విరిసి 
తొలిపొద్దున కురిసే
మంచుబిందువులై నునులేత సూర్య కిరణాలకే
కరిగి నీరయిపోయి 
పదహారేళ్ళ ప్రాయం

Tuesday, December 7, 2010

నేనంటే నీకెందుకు ?


అందమయిన ప్రకృతి నీలో కలిసి ముందుకు సాగి పోతుంటుంది 
వసంతాల చివురులు తొడిగి మరి మరి మారాకులు వేస్తుంటుంది 
సువాసనల రాదారిలో ప్రతి పువ్వు పులకింతల నవ్వు రువ్వుతుంది 
చినుకుల కిత కితలకి మట్టి వయ్యారాల మొలకలు పొడుస్తుంటుంది
నీ చూపు తగిలినంత మేరా ఆకాశం వేవేల చుక్కల తివాచీ విప్పుకుంటుంది 
నీ స్పందన కి పులకించిన సెలయేరు గల గలా జల జలా నవ్వుతూ కింది కి జారిపోతుంది 
ఓ కను సైగ కి  నీ వెచ్చటి స్పర్శకి సైతం నోచుకోని 
నా కన్ను ఉప్పునీటి ఏరై ఆగకుండా ఉప్పొంగుతుంది 
భగ భగ మని గుండె లావాలా గుబులవుతుంది 
నా ఒక్కదాని కోసం చిమ్మ చీకటి పరదాలు పరుస్తుంది 
నేను మాత్రం మంచులా బిగిసి ,
 కరిగి నీరై , ఆవిరై సమసిపోతాను 

Tuesday, November 30, 2010

ప్రేమ నువ్వెక్కడ


నువ్వు రాలేని దూరమని తెలిసి నీ కోసం తీయని తలుపుల వెనుక నిలబడి ఎదురు చూస్తుంటాను !!
నువ్వున్న చోటుకి చేరుకోలేనని తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తుంటాను 
నీకు నాకు మధ్య యుగాల వైరం కొలవలేనంత మౌనం వెలుగే లేనంత చీకటి 
దాటలేని లోయల మధ్య తెంచు కోలేని బంధాల మధ్య బందీనై ప్రతీ క్షణం ఆక్రోశిస్తుంటాను 
ఎక్కడో నువ్వున్నవనే వెర్రి ఆశతో  నా ఉనికిని గుండె గా మార్చి  సడి నీకు వినిపిస్తుంటాను 
నిన్ను చేరే ఘడియల కోసం నా ఉపిరి దారంతో కాలాన్ని కొలుస్తున్నాను

Thursday, November 25, 2010

Touched by

DON'T ASK WHAT HAPPENED
HEAR IT FROM MY EYES
FEEL IT FROM MY HEART

Thursday, October 28, 2010

నా ప్రియ నెచ్చెలీ

నీతో నేనుంటే అన్నీ రంగుల కలలే
నీ చిటికెన వేలూతతో నేను చూడలేని లోకాలన్నీ చుట్టేస్తాను 
నీ వెంట నడుస్తుంటే నాతొ నేను ఉన్నట్టే 
ఝరుల భావాల తుంపరలలో కలల తీరాల వెంట నీతో పరిగెడుతుంటే 
నాకు ఉచ్చ్వాస నిశ్వాసాలతో స్పృహే ఉండదేమిటో ??
జ్ఞాపకాల వీధుల్లో నాకు నచ్చే మజిలీకి నన్ను పొందికగా చేరుస్తావు 
నువ్వుంటే నా వెంట జలపాతాల జడివానలో తడిసిపోతుంటా 
నీ జంటే నాకుంటే మరువాల మరుమల్లెల పరిమళంలో మునిగిపోతుంటా 
నువ్వు నేను కలిసుంటే లోకంతో నాకు పని లేదు ఏది ఏమయిపోయిన నాకు అక్కరలేదు 
నా ప్రియ నెచ్చెలీ !!! పుస్తకమా !!!
నన్ను నా నుంచి వేరు చేసి తీసుకెళ్ల గలిగేది నీవే సుమా !!!