Thursday, December 30, 2010
Tuesday, December 7, 2010
నేనంటే నీకెందుకు ?
అందమయిన ప్రకృతి నీలో కలిసి ముందుకు సాగి పోతుంటుంది
వసంతాల చివురులు తొడిగి మరి మరి మారాకులు వేస్తుంటుంది
సువాసనల రాదారిలో ప్రతి పువ్వు పులకింతల నవ్వు రువ్వుతుంది
చినుకుల కిత కితలకి మట్టి వయ్యారాల మొలకలు పొడుస్తుంటుంది
నీ చూపు తగిలినంత మేరా ఆకాశం వేవేల చుక్కల తివాచీ విప్పుకుంటుంది
నీ స్పందన కి పులకించిన సెలయేరు గల గలా జల జలా నవ్వుతూ కింది కి జారిపోతుంది
ఓ కను సైగ కి నీ వెచ్చటి స్పర్శకి సైతం నోచుకోని
నా కన్ను ఉప్పునీటి ఏరై ఆగకుండా ఉప్పొంగుతుంది
భగ భగ మని గుండె లావాలా గుబులవుతుంది
నా ఒక్కదాని కోసం చిమ్మ చీకటి పరదాలు పరుస్తుంది
నేను మాత్రం మంచులా బిగిసి ,
కరిగి నీరై , ఆవిరై సమసిపోతాను
Tuesday, November 30, 2010
ప్రేమ నువ్వెక్కడ
నువ్వు రాలేని దూరమని తెలిసి నీ కోసం తీయని తలుపుల వెనుక నిలబడి ఎదురు చూస్తుంటాను !!
నువ్వున్న చోటుకి చేరుకోలేనని తెలిసి కూడా పిచ్చిగా పరుగులు తీస్తుంటాను
నీకు నాకు మధ్య యుగాల వైరం కొలవలేనంత మౌనం వెలుగే లేనంత చీకటి
దాటలేని లోయల మధ్య తెంచు కోలేని బంధాల మధ్య బందీనై ప్రతీ క్షణం ఆక్రోశిస్తుంటాను
ఎక్కడో నువ్వున్నవనే వెర్రి ఆశతో నా ఉనికిని గుండె గా మార్చి సడి నీకు వినిపిస్తుంటాను
నిన్ను చేరే ఘడియల కోసం నా ఉపిరి దారంతో కాలాన్ని కొలుస్తున్నాను
Thursday, November 25, 2010
Thursday, October 28, 2010
నా ప్రియ నెచ్చెలీ
నీతో నేనుంటే అన్నీ రంగుల కలలే
నీ చిటికెన వేలూతతో నేను చూడలేని లోకాలన్నీ చుట్టేస్తాను
నీ వెంట నడుస్తుంటే నాతొ నేను ఉన్నట్టే
ఝరుల భావాల తుంపరలలో కలల తీరాల వెంట నీతో పరిగెడుతుంటే
నాకు ఉచ్చ్వాస నిశ్వాసాలతో స్పృహే ఉండదేమిటో ??
జ్ఞాపకాల వీధుల్లో నాకు నచ్చే మజిలీకి నన్ను పొందికగా చేరుస్తావు
నువ్వుంటే నా వెంట జలపాతాల జడివానలో తడిసిపోతుంటా
నీ జంటే నాకుంటే మరువాల మరుమల్లెల పరిమళంలో మునిగిపోతుంటా
నువ్వు నేను కలిసుంటే లోకంతో నాకు పని లేదు ఏది ఏమయిపోయిన నాకు అక్కరలేదు
నా ప్రియ నెచ్చెలీ !!! పుస్తకమా !!!
నన్ను నా నుంచి వేరు చేసి తీసుకెళ్ల గలిగేది నీవే సుమా !!!
Friday, October 22, 2010
Am going to win.
Now, In my way lot of thorny politics
Still I wanna walk .. I wanna challenge my patience and my smiley face not to fade its colors.
Now, In my way lot of dusty stubborn unwilling roots
Still I wanna grow... I wanna keep on moving from phase to phase
Now, In my way lot of obstacles stopping me to move on
Still, I wanna run not to escape but to conquer the victory.
Because, I know Am going to achieve it some day
SO... Life I will throw the smiles to your challenges
Because I know Am going to win.
Thursday, October 21, 2010
నేను నువ్వయ్యి మురిసిపోతాను
పొద్దుటే పొడిచే సూర్య కిరణాలు నీ కొంటె చూపులను గుర్తు చేస్తాయి
నుదుటన దిద్దే తిలకం నీ మోముని చుపిస్తున్దేమిటి ?
నీ గుప్పిటలో బిగిసిన చేతిని గాజులతో మూసేస్తానా
గల గలమని గాజులు నవ్వుతుంటాయి ఆ తలపును గుర్తు చేస్తూ
సిగలో ముడిచిన జాజుల దండ నీ పరిమళం అయ్యి చుట్టూ ముడుతుంది ఏమిటో
ఎటు నడిచిన నువ్వు వెనుక రావటం లేదేమని
ఘల్లు ఘల్లున గొల్లుమంటాయి మువ్వల పట్టీలు
దిగులుగా జీరాడే చీర కుచ్చిళ్ళు మరింతగా ముడుచుకు పోతాయి
అల్లంత దూరాన నిన్ను చూసి సూరీడు గబుక్కున ఇంటికెళ్ళి పోతాడు
సందురుడు సంబరంతో చుక్కల అంబారి ఎక్కి వెన్నెల జలకాలాడుతాడు
ఆశ్చర్యంగా ఇంతవరకు నేనులా ఉన్న నేను నువ్వయ్యి మురిసిపోతాను
Subscribe to:
Posts (Atom)