తను నేను ఒకే దారానికి గుచ్చే పూసల్లా!!
హృదయాల మధ్య చిల్లులతో వెలితిగా !!
ప్రేమ దేవత మెడలో హారంగా !!
అధాటున అపార్ధాల లోయల్లోకి జారి పోయి ....
విడి విడిగా విసిరేసిన మబ్బుల్లా..
ఒక్కో సారి కలుసుకుంటూ ఎక్కువ సార్లు విడిపోతూ...
మొలకెత్తే బుజ్జి మొక్కల్లా ఎదిగిపోతూ..
ఫలించే వృక్షల్లా ఒదిగిపోతూ..
పువ్వుల్లా రోజుకోసారి రాలిపోతూ..
తను నేను ఒకే దారానికి గుచ్చే పూసల్లా..
Thursday, October 29, 2009
Wednesday, September 16, 2009
బహుశా దీని పేరే ... ??
మెత్తని అడుగుల నిస్సబ్ధపు హోరులో ..
వెలుగుల కళ్ళెత్తి చూస్తే అతని రూపు !!
మరింత చేరువయ్యి ...
నీ ప్రేమరాగాన్ని నా హృదయానికి ఎలా తెలుపగలవని నిలదీసినప్పుడు ...
కెంపులయినాయి చెక్కిళ్ళు ..
హృదయానికి చెవులతని అధరాలని తెల్పినపుడు ..
విరజాజులయి విచ్చుకున్నాయి తలపుల సౌరభాలు ..
రాగ రంజితాలయినాయి ఇరువురి హృదయాలు ....
బహుశా దీని పేరే ... ??
Monday, July 20, 2009
నువ్వొస్తావు
నిన్ను చూస్తే పెదవులు మాట్లాడలేక పోతాయి కనులు మూగగా ఉండలేక
పోతాయి నా కనులు ఊసులాడి నీ కనులకు కథలల్లి చెప్తాయి
కంటి చివర వంపుల్లోంచి నీ హృదయానికి వంతెనలేస్తాయి
రెప్పల తలుపులతో తలపులన్నీ నీ నుంచి దాచే వృధా ప్రయత్నం చేస్తాయి .
రెప్పల మధ్య మూసుకుని దాచుకున్న స్వప్నాల్ని
చదివేసే మాంత్రికుడల్లే నువ్వొస్తావు ..
తొలిపొద్దున సూరీడల్లే మలిపొద్దున సందురూడయ్యి ..
మనసు వనాల విహారానికొచ్చే వసంతుడల్లే నువ్వొస్తావు

Tuesday, June 30, 2009
నీ మౌనం
నువ్వు నేను ఆ చివర కొసన నించుంటాం
మాటల గొలుసుతో నిన్ను పెనవేసి ఫైకి లాగాలని నేను వెర్రి గా ప్రయత్నిస్తుంటా
నిశ్శబ్ధపు లోయలో ఉన్న నీకు నా పదాల ప్రహేళిక ప్రవల్లిక లా తోస్తుంది.
మౌనానికి ఆ చివర నువ్వు ఈ చివర నేను మిగిలిపోతాం
ప్రతి కలయిక లోను ఎప్పటికీ కలవని సమాంతర రేఖల్లగ.
Thursday, June 25, 2009
అక్షరాలు
అక్షరాలు కత్తులు నువ్వు తిట్టినపుడు
అక్షరాలుపువ్వులు నువ్వు నన్ను ప్రేమించినపుడు
అక్షరాలు విన్పించని రాగాలు నీ విరహంలో
అక్షరాలు భేషజాలు పొగడ్తలలో
అక్షరాలే గురువులు చదువులో
అక్షరాలే నీ జీవితం చాలాసార్లు
అక్షరాలు అవసం లేదు ఒక్క నీ మనసు సమక్షంలో
Thursday, June 18, 2009
నేను -- నిన్న , రేపు
ఇవాల్టి అపజయాల ఉలి దెబ్బలు పడకుండా రేపటి నా గెలుపు శిల్పాన్ని తీర్చి దిద్దలేను.
నిన్నటి అనుభవాల ఇవాల్టి అపజయాల కలబోత రేపటి నా విజయ కేతనం.
నిన్నటి అనుభవాల ఇవాల్టి అపజయాల కలబోత రేపటి నా విజయ కేతనం.
Tuesday, June 9, 2009
చిరునవ్వు
చిరునవ్వు నేను తరచు పరుగు పందాలాడుకుంటాం
ముద్దిస్తాను రమ్మని నేను పెదలమధ్య ఇరికెంచేస్తా చాలా మాట్లు
ఎక్కువసేపు నన్ను పట్టి ఉంచలేవు లెమ్మని ఎప్పుడో ఒకప్పుడు జారి వెళ్ళిపోతుంది
మళ్ళీ చిరునవ్వు నేను తరచు పరుగు పందాలాడుకుంటాం
ముద్దిస్తాను రమ్మని నేను పెదలమధ్య ఇరికెంచేస్తా చాలా మాట్లు
ఎక్కువసేపు నన్ను పట్టి ఉంచలేవు లెమ్మని ఎప్పుడో ఒకప్పుడు జారి వెళ్ళిపోతుంది
మళ్ళీ చిరునవ్వు నేను తరచు పరుగు పందాలాడుకుంటాం
Subscribe to:
Posts (Atom)