Monday, March 30, 2009

ప్రేమించమంటే


మనసిస్తాను మన్నించమన్నాను

నిశ్శబ్ధం నాకు మిగిలించాడు

పులకిస్తాను ప్రేమించమన్నాను

నిర్లక్ష్యం నాకు సమాధానాల సమాధి అయ్యింది.

Sunday, March 29, 2009

ప్రేమంటే ...నాకు.. అర్థం కాదు??

ప్రేమంటే ...
అమ్మ నీకిష్టమయిన వంట కోసం పడే ప్రతి రోజు శ్రమ ...
నాన్న నీకు ఇవ్వాల్సిన బహుమతి కోసం అనుదినం అదనంగా చేసే పొదుపు, మదుపు ..
అది చిలిపి తగాదా అయినా సరే...అన్నో అక్కో నీతొ గడిపే అమూల్య క్షణం ..
తాతయ్య అమ్మమ్మ నీ సెలవుల కోసం ఎదురు చూసే మధుర అనుభూతి...
ప్రతిఫలం ఆశించకుండా వీచేగాలిది ..
పూచే నీ పెరటి పువ్వుది ..
నీకు గొడుగు పట్టే అంబరానిది ..
అనుక్షణం నిన్ను మోసె భూమిది ..
ఎప్పుడు నీకు అండగ ఉండే నేస్తానిది ..
ఆ తరువాతే ... ఇంకా ...
ఇంకా నీకు అదృష్టం ఎక్కువయితే దేవుడు పంపే తోడుది...
మరి ప్రేమంటే ఒకటె అర్థం ఇస్తారెందుకో ??
నాకు అస్సలు నాకర్థం కాదు. :(

నవ్వెయ్యి..రోజంతా...

ఎన్నో వంకరలను సరిచేసే నీ పెదవి చిన్న వంపే నీ నవ్వు పువ్వులు నవ్వుతాయి వాడిపోయి రాలిపోతామని తెలిసినామువ్వలు నవ్వుతాయి ఘల్లుమంటు నువ్వు నవ్వచ్చుగా ఝల్లుమంటూ మరి ..నవ్వెయ్యి..రోజంతా...

Thursday, March 26, 2009

నీ చిరునవ్వు

అపజయాలు భయాలు అనుమానాలు కోపాలు యుధ్ధాలు
అన్నిటిని తుడిచిపెట్టేది నీ చిరునవ్వు
... మరి నవ్వెయ్యి..రోజంతా...

Tuesday, March 24, 2009

రేపటి పై ఆశ లేక పోతే మనిషి అభివ్రుద్ధి శూన్యంగా ఉండేది
ఇవాళ్టి చీకటి రేపు సూర్యోదయం కాగానే వెలుగులు నింపుతుంది.

Sunday, February 8, 2009

మా తెలివి -- మా భవిత

మేము తెలివయిన వాళ్ళం


కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం


రేపటి భావి తరం అమ్మలను ఇవాళే కడుపుదాటి రానివ్వం


గడప దాటే అభివృద్దికి ఇవాళే మంగళహారతి పాడుకుంటాం


ప్లాస్టిక్కు కవర్లతో భూమితల్లిని


మా సూటిపోటి మాటలతో


మా జన్మకు కారణమయిన తల్లులను చీల్చి


చెండాడుకుంటాం ఎవరేమయినా అనుకోండి మాకేం


మేము తెలివయిన వాళ్ళం కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం


ఏ జాతి లోను లేని స్వజాతి వివాదాలకు మేము పట్టం కడతాం


అత్తగా కోడలిని కోడలిగా అత్తని తిట్టుకుంటాం కొట్టుకుంటాం


చదువుల తల్లులను చిరునవ్వుల చెళ్ళెళ్ళను


మా చూపుల చాకులతో చిదిమేసి మా వెకిలి చేష్టలతో


వాళ్ళ గొంతు నులిమేసుకుంటాం


మాకేం మేము తెలివయిన వాళ్ళం కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం

Sunday, January 18, 2009

నువ్వేగా అంతటా నాకు


సెలయేరువై నీవు ప్రవహిస్తావు


చిరుగాలిలా నన్ను మురిపిస్తావు


చిరుజల్లువై మదిలో కురుస్తావు


జడివానలా నన్ను ముంచేస్తావు


తొలిమంచులో నీవుకనిపిస్తావు


పూదోటలో నువ్వు వికసిస్తావు


వెన్నలలా నీవు వెలుగిస్తావు


హరివిల్లు నీవై రంగులు విరబూయిస్తావు


కోవెలలో దీపంలా


పెరటిలో పూచేటీ మందార పువ్వమ్మలా నవ్వుతావు


మనసులో నీవు మాటలో నీవు


సంథ్యలో నీవు తొలి పొద్దులో నీవు


నా మౌనంలో నీవు నా రాగంలో నీవు


భావమా నా జీవమా


నా ప్రేమవే నీవు నా ప్రాణమే నీవు