Wednesday, April 28, 2010

గెలుపు - రెసిపి


ముందుగ కొంచెం నిరాశ
ఆ తరువాత చాల కొంచెం నిస్పృహ

ఓపలేనంత బరువు
తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు
చేరలేనంత దూరం
చెప్పలేనంత దిగులు

ఎటు చూసిన హేళనలు ,
అక్కర్లేని సానుభూతులు
మింగలేనంత చేదు అనుభవాలు

మరి కొంచెం దూరం ఉందనగా
మొట్టమొదటి అపజయం
తరువాత హాలాహలం
అపజయాల వెల్లువ
జారిపోతున్న మెట్లు
అఘాదాలు

అలుపెరుగని నీ కష్టం
వెల కట్టలేని నీ ధైర్యం
నీతో తోడుగా సాగిపోతుంటాయి

అదిగో అక్కడ ఈ అపజయాల మెట్ల పయిన
కష్టాల కడలి అవతల
విజయం .. నీ తొలి గెలుపు ...

ఇప్పుడు నీకు అపజయం విజయానికి తొలిమెట్టని
తెల్సిపోయిన్దోచ్...

ఇక నిన్నెవ్వరూ ఆపలేరు అడ్డుకోలేరు
నీకు నీ శ్వాస ధ్యాస ధైర్యం లక్ష్యం చాలు
మరిన్ని మెట్లు జారుతూ ఎక్కుతూ
పై పైకి చేరుకుంటూ.

ఎండలు

కలువ కాంతలూ
వెన్నెల కాంతులు
విరజాజుల పరిమళాలు
మల్లెపూల మాలలు
మనసునిండా మధురూహలు
మండించే ఎండలు ..

తొలకరి జల్లులకై ఎదురుచూపులు
ఎంచక్కా రావచ్చుగా ఇంకా చిట్టి పొట్టి చినుకులు

Tuesday, March 23, 2010

గెలుపు - రెసిపి

ముందుగ కొంచెం నిరాశ
ఆ తరువాత చాల కొంచెం నిస్పృహ

ఓపలేనంత బరువు
తట్టుకోలేనంత చీకటి
ఆపలేనంత పరుగు
చేరలేనంత దూరం
చెప్పలేనంత దిగులు

ఎటు చూసిన హేళనలు ,
అక్కర్లేని సానుభూతులు
మింగలేనంత చేదు అనుభవాలు

మరి కొంచెం దూరం ఉందనగా
మొట్టమొదటి అపజయం
తరువాత హాలాహలం
అపజయాల వెల్లువ
జారిపోతున్న మెట్లు
అఘాదాలు

అలుపెరుగని నీ కష్టం
వెల కట్టలేని నీ ధైర్యం
నీతో తోడుగా సాగిపోతుంటాయి

అదిగో అక్కడ ఈ అపజయాల మెట్ల పయిన
కష్టాల కడలి అవతల
విజయం .. నీ తొలి గెలుపు ...

ఇప్పుడు నీకు అపజయం విజయానికి తొలిమెట్టని
తెల్సిపోయిన్దోచ్...

ఇక నిన్నెవ్వరూ ఆపలేరు అడ్డుకోలేరు
నీకు నీ శ్వాస ధ్యాస ధైర్యం లక్ష్యం చాలు
మరిన్ని మెట్లు జారుతూ ఎక్కుతూ
పై పైకి చేరుకుంటూ.

Tuesday, November 10, 2009

మనసా .. కాస్త ఆగవే ..

మరి మరి అడుగకు గుచ్చుకునేలా !!
చూపుల విరి తూపులకు మనసు విచ్చుకునేలా ..
కౌగిలంతలడుగకు సిగ్గుపడేలా!!
కవ్వింతల పులకింతలు తుళ్ళిపడేలా ..
మరుమల్లెల విరి తావులు మెరిసిపొయేలా ..

మరి మరి అడుగకు మురిసిపొయేలా !!
విరహాల వాకిళ్ళు తెరుచుకునేలా..
వెన్నెల చెమరింతలు గుండెల్లో పరుచుకెనేలా..

Thursday, November 5, 2009

నా కన్నడ పాట.

SR_me_Nindale.wav

నా కన్నడ పాట.

ఈ పాట చాలా ఫేమస్ కన్నడలో ..

సరదాగ మా ఆఫీసులో పాడాను. బ్లాగులో పెట్టాను..

చాలా లిరిక్సు తప్పులుంటాయి.

కాని చూడకుండా పాడాను మరి.
మీ శ్రీలు

Thursday, October 29, 2009

తను నేను - ప్రేమా పెళ్ళి

తను నేను ఒకే దారానికి గుచ్చే పూసల్లా!!
హృదయాల మధ్య చిల్లులతో వెలితిగా !!
ప్రేమ దేవత మెడలో హారంగా !!
అధాటున అపార్ధాల లోయల్లోకి జారి పోయి ....
విడి విడిగా విసిరేసిన మబ్బుల్లా..
ఒక్కో సారి కలుసుకుంటూ ఎక్కువ సార్లు విడిపోతూ...
మొలకెత్తే బుజ్జి మొక్కల్లా ఎదిగిపోతూ..
ఫలించే వృక్షల్లా ఒదిగిపోతూ..
పువ్వుల్లా రోజుకోసారి రాలిపోతూ..
తను నేను ఒకే దారానికి గుచ్చే పూసల్లా..

Wednesday, September 16, 2009

బహుశా దీని పేరే ... ??

మెత్తని అడుగుల నిస్సబ్ధపు హోరులో ..

వెలుగుల కళ్ళెత్తి చూస్తే అతని రూపు !!

మరింత చేరువయ్యి ...

నీ ప్రేమరాగాన్ని నా హృదయానికి ఎలా తెలుపగలవని నిలదీసినప్పుడు ...

కెంపులయినాయి చెక్కిళ్ళు ..

హృదయానికి చెవులతని అధరాలని తెల్పినపుడు ..

విరజాజులయి విచ్చుకున్నాయి తలపుల సౌరభాలు ..

రాగ రంజితాలయినాయి ఇరువురి హృదయాలు ....

బహుశా దీని పేరే ... ??