కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
కల కానిది
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగా
జాలి వీడి అటులే దాని వదలి వైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా
కల కానిది
అలముకున్న చీకటిలోనే అలమటించనేల
అలముకున్న చీకటిలోనే అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలవరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో
కల కానిది
అగాధమౌ జలనిధి లోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖము న్నదిలే
అగాధమౌ జలనిధి లోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖము న్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం
కల కానిది
ఎంతో విలువలున్న ఈ పాటంటే చాలా ఇష్టం నాకు. కష్టాలు వచ్చినపుడు గుండె నిబ్బరం చేసుకొమ్మని ఒక నేస్తం దారి చూపినట్లుండే సాహిత్యం కమ్మగా సాగే పాట ఎప్పుదు విన్నా నాకు ఆ స్పూర్తి తో ముందుకి సాగిపొమ్మని నా ఆత్మీయులు సలహా ఇచ్చినట్లనిపిస్తుంది.
మరి ఈ పాట వినాలంటే ఈ లింకు లో వినొచ్చు